సూర్యాపేట జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు గా పెద్దిరెడ్డి గణేష్ ఏకగ్రీవ ఎన్నిక
సూర్యాపేట, 17 అక్టోబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట లో జరిగిన కవులు రచయితల సమావేశంలో సూర్యాపేట జిల్లా రచయితల సంఘం ఏర్పాటు అయింది. ఇటీవల సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గ రచయితల సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నాలుగు నియోజకవర్గాల కార్యవర్గాల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న కార్యవర్గ సభ్యులు కవులు రచయితలు కలిసి శనివారం సుధా బ్యాంక్ లో సూర్యాపేట జిల్లా రచయితల సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రముఖ కవి రచయిత, సాహితీవేత్త పెద్దిరెడ్డి గణేష్ సూర్యాపేట జిల్లా రచయితల సంఘం అధ్యక్షులుగా, ప్రముఖ కవి పిల్లల మరి పినవీరభద్రం కళాపీఠం వ్యవస్థాపకులు శీలా అవిలేను...