పోలీసు ఉత్తమ సేవా పతకం అందుకున్న సూర్యాపేట జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి

డీజీపీ సీవీ ఆనంద్ ఐపీఎస్ చేతుల మీదుగా పతకం అందజేత – అభినందనలు తెలిపిన జిల్లా ఎస్పీ కె. నరసింహ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు–2026 సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభా పురస్కారాల్లో సూర్యాపేట జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డికి పోలీసు ఉత్తమ సేవా పతకం లభించింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ సీవీ ఆనంద్ ఐపీఎస్ గారు డీజీపీ కార్యాలయంలో రవీందర్ రెడ్డికి పతకాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ శ్రీ కె. నరసింహ అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డిని అభినందించారు. పోలీసు శాఖలో సుదీర్ఘకాలంగా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తూ...