యువత మేలుకో మత్తులో భవిష్యత్తును బలి చేసుకోవద్దు
యువత మేలుకో మత్తులో భవిష్యత్తును బలి చేసుకోవద్దు మహబూబాబాద్, ప్రతినిధి (అక్టోబర్ 17) : చేతిలో పుస్తకం పట్టాల్సిన వయసులో మత్తు పదార్థాలకు ఆకర్షితులవడం.. జీవితానికి లక్ష్యం నిర్దేశించుకోవాల్సిన దశలో చెడు వ్యసనాలకు బానిసలవడం, తల్లిదండ్రుల ఆశలను, తమ భవిష్యత్తును చేజేతులా దూరం చేసుకోవడం ఆందోళన కలిగించే పరిణామాలు. ఏడో తరగతి నుంచి ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులతో పాటు చదువును మధ్యలోనే ఆపేసిన యువత, విద్యకు దూరంగా ఉంటున్న యువకులు, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు సైతం మత్తు పదార్థాల ముప్పు బారిన పడకుండా సమాజం పట్ల బాధ్యతాయుతులైన పెద్దలు అప్రమత్తం కావాలి. -- రాత్రివేళల్లో చీకటి సందుల్లో. యువత గుంపులుగా చేరడం, మద్యం...