ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ

ముఖ్యమైన పాయింట్స్:జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూర్యాపేట:- సాంస్కృతిక వారసత్వానికి, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి బతుకమ్మ పండుగ ప్రతీక అని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా శుక్రవారం ప్రభుత్వం ఆదేశాల మేరకు, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ఐక్యతను చాటే పండుగ మహిళలందరూ సమిష్టిగా చేరి బతుకమ్మ ఆడటం వల్ల సమాజంలో సాంఘిక ఐక్యత మరింత బలపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. తొమ్మిది రోజుల పాటు విశిష్టమైన పేర్లతో వేడుకలు...