ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు.

మహిళా పోలీసు సిబ్బందితో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ కె.నరసింహ. సూర్యాపేట:- సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం మహిళా పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, చిన్నారుల సమక్షంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె.నరసింహ ఉత్సవాలను ప్రారంభించి, మహిళా పోలీసు సిబ్బందితో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మహిళా పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ఇలాంటి వేడుకలు సిబ్బంది మధ్య ఆత్మీయతను, ఐక్యతను మరింత పెంపొందిస్తాయని తెలిపారు. పోలీస్ సిబ్బంది అందరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి...