కాంగ్రెస్ వల్లనే కరవు వచ్చిందని బీఆర్ఎస్ అనడం వాళ్ల పైశాచిక ఆనందానికి ఇది నిదర్శనం..
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్తాన్ రాష్ట్రాలతో పాటు బ్రిటన్, జపాన్ లాంటి దేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఉందా..? అక్కడ ఎలా ఏ సమస్య ఉంది? 100 దేశాల్లో ఎల్ నినో ఈ సమస్య ఉంది.. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు.. అబద్ధాలతోనే అధికారంలోకి రావాలని, ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నారు.. ఎవరు పక్క రాష్ట్రాలకు వెళ్లి శుద్రపూజలు చేశారో, చేతబడి చేశారో తెలంగాణ ప్రజలకు తెలుసు.. ప్రజలు అమాయకులు కాదు.. 2015లో కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 515 టీఎంసీలు చాలని ఎవరు సంతకం పెట్టారు? సంతకం పెట్టినవాడు మనిషేనా? శాశ్వతంగా తెలంగాణకు కృష్ణా జలాల్లో మరణశాసనం రాసింది ఎవరు? కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను...