శబరిమల భక్తులకు గుడ్ న్యూస్..

అక్టోబర్, తెలంగాణ వార్త ప్రతినిధి:- శబరిమలలో అరవణ ప్రసాదం కొరతకు త్వరలోనే తెరపడనుంది. ప్లాంట్ ఆధునికీకరణ పనులు ముగింపు దశకు చేరడంతో, అక్టోబర్ 20 నాటికి రోజువారీ ఉత్పత్తిని 3.65 లక్షల డబ్బాలకు పెంచనున్నారు. తులా మాస పూజల కోసం ఇప్పటికే 10 లక్షల డబ్బాలను సిద్ధం చేసినట్లు దేవస్వం బోర్డు తెలిపింది.