సైబర్ నేరాలపై అవగాహనతోనే మోసాలకు అడ్డుకట్ట
ప్రజలు, బ్యాంకు అధికారులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సైబర్ సెక్యూరిటీ సెల్ డీఎస్పీ వెంకటయ్య. సూర్యాపేట, అక్టోబర్ 15: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్ల మోసపూరిత మాటలు నమ్మి డబ్బులు కోల్పోవద్దని సూర్యాపేట జిల్లా సైబర్ సెక్యూరిటీ సెల్ డీఎస్పీ ఏ. వెంకటయ్య సూచించారు. సైబర్ నేరాల నియంత్రణ, ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో భాగంగా గురువారం సూర్యాపేట ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థినులకు, కోదాడ పట్టణంలో బ్యాంకర్ల సమావేశంలో బ్యాంకు అధికారులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా APK ఫైళ్ల ద్వారా జరిగే మోసాలు, లోన్ మరియు లోన్ యాప్ మోసాలు,...