మన అమ్మ హాస్పిటల్‌లో అత్యాధునిక సాంకేతికత ప్రారంభం

ముఖ్యమైన పాయింట్స్:ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలిసారిగా రోబోటిక్ కీళ్ల మార్పిడి సేవలు సూర్యాపేట జిల్లా అక్టోబర్ 15 :- ఉమ్మడి నల్గొండ జిల్లా వైద్యరంగంలో మరో కీలక ముందడుగు పడింది. సూర్యాపేటలోని మన అమ్మ హాస్పిటల్‌లో అత్యాధునిక రోబోటిక్ సాంకేతికతతో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన రోబోటిక్ వ్యవస్థను డా.రామకృష్ణ, డా.విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అధినేతలు డా.సుధీర్ కుమార్, డా.స్వరూప లక్ష్మి మాట్లాడుతూ ఆధునిక వైద్య సాంకేతికతను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు.రోబోటిక్ సాంకేతికతతో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సల్లో మరింత ఖచ్చితత్వాన్ని సాధించడంతోపాటు,రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రోబోటిక్ కీళ్ల...