నాణ్యమైన పత్తితో మద్దతు ధర - జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
నాణ్యమైన పత్తితో మద్దతు ధర - జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తేమ 8 శాతమే ఉండేలా చూసుకోవాలి దళారులను ఆశ్రయించి మోసపోవద్దు 2026–27 పత్తి మార్కెటింగ్ సీజన్‌లో రైతులు నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేసి, ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర పొందేలా తగిన జాగ్రత్తలు పాటించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. పత్తి సాగు, కోత, నిల్వ, విక్రయ ప్రక్రియల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే ఆశించిన మద్దతు ధర లభిస్తుందని స్పష్టం చేశారు. నాణ్యతతోనే మంచి మద్దతు ధర రైతులు తమ పత్తిని మార్కెట్‌కు తీసుకువచ్చే ముందు తేమ శాతం, పొడవు, మైక్రోనైర్ విలువ...