విలేకరులు నిజాలు రాస్తే పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా..

అడ్డగూడూరు 15 అక్టోబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- కరీంనగర్ జిల్లా గంభీరావుపేట ప్రాంతానికి చెందిన జర్నలిస్టులు పొత్తూరి శేఖర్,సంపత్ లపై తమ పై వ్యతిరేక వార్తలు రాస్తున్నారని ఉద్దేశంతో అక్రమ కేసులు బనాయించి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన గంభీరావుపేట పోలీసులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని విధుల నుండి శాశ్వతంగా సస్పెండ్ చేయాలని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం అడ్డగూడూరు మండల అధ్యక్షులు నీర్మాల వెంకటేశ్వర్లు మాదిగ డిమాండ్ చేశారు.గురువారం రోజున ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వృత్తి నిర్వహణలో భాగంగా నిజాలను నిర్భయంగా రాస్తే జీర్ణించుకోలేని పోలీసులు అక్రమ కేసులు బనాయించి ముందస్తు సమాచారం లేకుండా కిడ్నాప్ చేసి స్టేషన్ కు తరలించి థర్డ్ డిగ్రీ...