తుంగతుర్తి నియోజకవర్గం ప్రజలు సుఖశాంతులతో ఉండాలి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్

తిరుమలగిరి 16 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తిరుమలగిరి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు & మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గమాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు ప్రసాదాలు అందజేసిన డా.గాదరి కిశోర్ కుమార్ తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కరువు, కాటకాలు రాకుండా, పంటలు సమృద్ధిగా పండి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని దుర్గామాత అమ్మవారిని ప్రార్థించారు. ప్రతి ఒక్కరిపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర...