బతుకమ్మ ఆటపాట కార్యక్రమం

ముఖ్యమైన పాయింట్స్:భువనగిరిలో ఘనంగా ఎన్‌పీఆర్‌డీ మహిళా విభాగం ఆధ్వర్యంలో భువనగిరి 15 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ)యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని సుందరయ్య భవనంలో బతుకమ్మ ఆటపాట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్,జిల్లా మహిళా విభాగం కన్వీనర్ కొత్త లలిత మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానంలో ప్రత్యేక స్థానం కలిగి ఉందని పేర్కొన్నారు. వికలాంగ మహిళలు సైతం అన్ని రంగాల్లో...