ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ కార్యక్రమం
అడ్డగూడూరు 14 అక్టోబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే మందుల సామేల్ ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు నిమ్మనగోటి జోజీ, బీసీ సెల్ మండల ఉపాధ్యక్షులు పురుగుల మల్లేష్,చాల్ల రామారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మందుల సోమన్న, నాయకులు అల్లం వెంకన్న, అనంతుల దేవాంజి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.