చిన్న పిల్లలకు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి
తిరుమలగిరి 15 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- పిల్లలకు సమయానికి రోగ నిరోధక టీకాలు వేయించాలి. దానికో క్రమ పద్ధతి ఉంటుంది. నిర్దిష్ట సమయంలో నిర్ణీత వ్యాక్సినేషన్ వేయించాలని సి హెచ్ ఓ చంద్రశేఖర్ అన్నారు తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో వారు ఆకస్మిక తనిఖీ నిర్వహించి బాలింతలకు గర్భిణీలకు అవగాహన కల్పించారు ఈ వ్యాక్సీన్ల వల్ల ప్రాణాంతకమైన 20 రకాల వ్యాధుల బారిన పడకుండా పిల్లల్ని కాపాడుకోవచ్చు.పిల్లలకు పుట్టిన వెంటనే నేషనల్ ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ ప్రకారం వ్యాక్సినేషన్లు ఇవ్వడం వల్ల డిఫ్తీరియా, పెర్ట్యూసిస్, టెటనస్, పోలియో, మీజిల్స్, బీసీజీ, టీబీ,హెపిటైటిస్-బి, హిమోఫిలస్ ఇన్ఫ్లూయెంజా టైప్ బి, డయేరియా,...