గిరిజనుల హక్కుల సాధన ఆధార్ పార్టీతోనే సాధ్యం
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ నిధులు పూర్తిగా వారికే ఖర్చు చేయాలి రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం ఆధార్ పార్టీ పినపాక నియోజకవర్గ సమావేశంలో డా. ఈడా శేషగిరిరావు ఉప్పెన / పినపాక: గిరిజనుల హక్కుల సాధన ఆధార్ పార్టీతోనే సాధ్యమని, గిరిజనులకు అండగా ఆధార్ పార్టీ ఉంటుందని, ఆధార్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా .ఈడా శేషగిరిరావు అన్నారు. మంగళవారం మణుగూరు మండల కేంద్రంలో పినపాక నియోజకవర్గ ఆధార్ పార్టీ కార్యకర్తల సమావేశం కల్తీ రమేష్ అధ్యక్షత జరిగింది. ఈ సమావేశంలో డా.శేషగిరిరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీటికి సరైన ప్రత్యామ్నాయం ఆధార్ పార్టీయేనని ఆయన అన్నారు.ప్రజా సమస్యల పరిష్కారమే...