ధనలక్ష్మి అలంకారంలో జమ్మలమ్మ దర్శనం
జోగులాంబ గద్వాల 13 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. గద్వాల. పట్టణంలోని జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్దలతో కొనసాగుతున్నాయి. మంగళవారము అమ్మవారిని రూ, 9.99 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఆలయ ఈవో రవీందర్ భక్తులకు సౌకర్యార్థం అవసరమైన ఏర్పాట్లు చేశారు. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.