ఖమ్మం జిల్లా రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది
ప్రతి నియోజకవర్గంలో 20 వేల మంది పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలి: రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల శాసనమండలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ఖమ్మం జిల్లా సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందిస్తున్న భరోసాతోనే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఖమ్మం జిల్లాతో రాంరెడ్డి కుటుంబానికి ఎంతోకాలంగా అనుబంధం ఉందని, ఈ జిల్లా ప్రజల ఆదరాభిమానాలకు రుణం తీర్చుకునే అవకాశం తనకు లభించిందని...