ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్న ‘ప్రజావాణి’

తిరుమలగిరి 13 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ "తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న “ప్రజావాణి” కార్యక్రమం కిందిస్థాయిలో మాత్రం నిర్లక్ష్యానికి గురవుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటిని పట్టించుకోని అధికారులు ప్రజలను నిరాశపరుస్తున్నారు. తిరుమలగిరి మండల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం నిరాశాజనక దృశ్యాలకు వేదికైంది. ఈ కార్యక్రమానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరు కాకపోవడంతో ఖాళీ కుర్చీలు మాత్రమే దర్శనమిచ్చాయి. ఎస్టీ వెల్ఫేర్ , డిషనల్ ప్రోగ్రాం ఆఫీసర్, సివిల్ సప్లై, పోలీస్, హౌసింగ్ ,ఫారెస్ట్, వ్యవసాయ, పశువు సమర్థత,...