అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తే కూల్చివేతలు తప్పవు

గద్వాల, అక్టోబరు 12: పట్టణ శివారులో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్‌పై మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. గద్వాల–ఐజ రహదారిలోని సర్వే నంబరు 871లో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్‌లోని రాళ్లను తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్‌ ఏర్పాటు చేసినట్లు గుర్తించి ఈ చర్యలు చేపట్టినట్లు తెలిసింది. అనుమతులు తప్పనిసరి ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, సంబంధిత శాఖల అనుమతులతోనే వెంచర్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతులు, మున్సిపాలిటీ అనుమతి లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసే వెంచర్లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతోపాటు,...