నేడు బ్రహ్మచారిని దేవిగా జోగులాంబ దర్శనం
జోగులాంబ గద్వాల 12 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. అలంపూర్. లోని ప్రసిద్ధి జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారము రెండవ రోజు జోగులాంబ అమ్మవారు బ్రహ్మచారిని దేవి అలంకరణ లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 18 మహాశక్తి పీటల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలివస్తున్నారు.