కొత్త కమాండెంట్ గా అలెక్స్
జోగులాంబ గద్వాల 12 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. ఎర్రవల్లి మండలం. బీచుపల్లిలోని తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీ ఎస్ పీ )10వ బెటాలియన్ కొత్త కమాండెంట్‌గా టి. అలెక్స్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్-చార్జ్ కమాండెంట్ ఆదినారాయణ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం బెటాలియన్ అధికారులతో సమావేశమై విధులు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.