గ్రీవిన్స్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి :: జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్
ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తు లను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్, డి.ఆర్.ఓ నాగలక్ష్మి లతోకలిసి ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పలు సమస్యలపై ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న ప్రజల యొక్క దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అన్నారు. ఈ రోజు వచ్చిన దరఖాస్తులలో మహబూబాబాద్ లోని గుమ్ముడూరు ప్రాంతానికి చెందిన అవారి నిర్మల సర్వే నెంబర్.36/A లో గల ఒక ఎకరం 19...