గ్రామ గ్రామాన బతుకమ్మ వేడుకలు
తిరుమలగిరి 11 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ తిరుమలగిరి మున్సిపాలిటీతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో భాగంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సాంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని అంగడి ప్రాంగణంతో పాటు మార్కెట్ యార్డులోనూ మహిళలు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల్లోనూ మహిళలు బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు.ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకలు గ్రామగ్రామాన కొనసాగనున్నాయి. ప్రతిరోజూ వివిధ రకాల పూలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయబద్ధంగా పూజలు...