తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ
ఈ పండుగకు అధికారిక గుర్తింపునిచ్చిన ఘనత కెసిఆర్ దే.. బతుకమ్మ, దేవీ నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలి.. ప్రజలందరికీ బతుకమ్మ, శరన్నవరాత్రుల శుభాకాంక్షలు.. మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ సందర్బంగా ఆడపడుచులందరికీ మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. శనివారం పితృ అమావాస్యతో ప్రారంభమయ్యే బతుకమ్మ ఉత్సవాలతో పాటు ఆదివారం నుంచి ప్రారంభమయ్యే దేవి శరన్నవరాత్రోత్సవాలు ఐక్యతతో, ప్రశాంతవాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఎక్కడా లేనివిదంగా ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే బతుకమ్మ తెలంగాణ ఉద్యమంతో ఖండాంతరాలకు విస్తరించిందని తెలిపారు. పోరాడి సాధించిన తెలంగాణలో బతుకమ్మ పండుగకు ప్రత్యేక...