సమాచార హక్కు చట్టం అమలులో ఉత్తమ పనితీరుకు జిల్లా కలెక్టర్ అంకిత్‌కు అవార్డు
హైదరాబాద్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా అవార్డు స్వీకరణ పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన ప్రజాకేంద్రిత పాలనకు జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు సమాచార హక్కు చట్టం అమలులో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సమాచార హక్కు వారోత్సవాలు–2026 కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ అంకిత్ ఈ అవార్డును స్వీకరించారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడం, పౌరులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించడం, చట్ట నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడం లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమాచార...