మహబూబాబాద్‌కు ‘సీసీ’ రక్షణ ఏది

​కొన్ని చోట్ల సగం విరిగిపోయి, నేలచూపులు చూస్తున్న నిఘా నేత్రాలు! ​మరికొన్ని కీలక ప్రాంతాల్లో అసలే లేని సీసీ కెమెరాల వ్యవస్థ ​నూతన జిల్లా కేంద్రంలో పెరుగుతున్న రాకపోకలు... అదనుగా భావిస్తున్న అసంఘటిత శక్తులు ​దొంగతనాలు, కొట్లాటలు, మహిళలపై వేధింపులకు చెక్ పడేది ఎలా? ​బతుకమ్మ పండుగ వేళ పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని మహబూబాబాద్ ప్రజల డిమాండ్ ✍️ ఇండ్ల మహేష్ ​ మహబూబాబాద్ (పట్టణం): మహబూబాబాద్ నూతనంగా జిల్లాగా అవతరించిన తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతోంది. జిల్లా కేంద్రం కావడంతో ప్రతినిత్యం చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి వేలాది మంది ప్రజలు, వ్యాపారులు, విద్యార్థులు వివిధ పనుల నిమిత్తం పట్టణానికి రాకపోకలు సాగిస్తున్నారు....