హైడ్రా పేరు చెప్పి బిల్డర్ల దగ్గర డబ్బులు దండుతున్న అధికారులు

మాట వినని బిల్డర్ల ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయవద్దని సబ్ రిజిస్ట్రార్లకు లేఖలు మెహిదీపట్నం సర్కిల్‌లో భవన నిర్మాణం కోసం ఓ వ్యక్తి నుంచి రూ.4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ తులసిరాం సునీత. ఆమెను విచారించగా బయటపడ్డ విస్తుపోయే విషయాలు. హైడ్రా పేరు చెప్పి డబ్బులు ఇవ్వకపోతే భవనం కూల్చేస్తామని భయపెట్టి రూ.8 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని రూ.4 లక్షలు తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డ సునీత. ఇలానే హైడ్రా పేరు చెప్పి బిల్డర్లతో భారీ మొత్తంలో డబ్బులు లాగుతున్న అధికారులు అడిగినంత ఇవ్వకపోతే ఆ ఆస్తులు రిజిస్ట్రేషన్ కాకుండా రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖలు రాసి అడ్డుకుంటున్న అధికారులు