ఆపదలో ఉన్న కుటుంబానికి ప్రెస్ క్లబ్ కోదాడ అండ
ముఖ్యమైన పాయింట్స్:దాతలుగా కాసారపు కృష్ణ (చందు మొబైల్స్), ఎం.డీ. రహీమ్, షేక్ నూరుద్దీన్ అనారోగ్యంతో పనులకు దూరమైన షేక్ మన్నాన్కు నిత్యావసర సరుకుల పంపిణీ దాతలుగా కాసారపు కృష్ణ (చందు మొబైల్స్), ఎం.డీ. రహీమ్, షేక్ నూరుద్దీన్ కోదాడ: ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని చాటుతూ ప్రెస్ క్లబ్ కోదాడ సభ్యులు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ జీవనోపాధికి దూరమైన ఓ నిరుపేద వ్యక్తికి నిత్యావసర సరుకులు అందించి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. కోదాడ పట్టణంలోని నయానగర్ 15వ వార్డుకు చెందిన షేక్ మన్నాన్ కాళ్లకు గాయాలై, ఇన్ఫెక్షన్ కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. ఈ పరిస్థితుల్లో పనులకు వెళ్లలేక కుటుంబ...