సొంత గ్రామంలో రెడ్‌క్రాస్ జిల్లా డైరెక్టర్ కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డికి ఘన సత్కారం
అడ్డగూడూరు 9 అక్టోబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ యాదాద్రి జిల్లా డైరెక్టర్‌గా ఎన్నికైన కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డిని ఆయన స్వగ్రామమైన చౌల్లరామరంలో బీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాసేవలో చురుకుగా పాల్గొంటూ గ్రామానికి, మండలానికి మంచి పేరు తీసుకురావడం అభినందనీయమన్నారు. రెడ్‌క్రాస్ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలను మరింత విస్తరించి, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మందుల రేణుక కిరణ్, ఉప సర్పంచ్ తోట కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ దర్శనాల అంజయ్య, సింగిల్ విండో డైరెక్టర్ పోగుల నర్సిరెడ్డి, నాయకులు మెట్టు భాస్కర్‌రెడ్డి, తోట భాస్కర్‌రెడ్డి, కూకట్ల రాజు, ననుబోతు...