బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలి

ప్రతి ఆడబిడ్డ ఆనందంగా.. ప్రతి కుటుంబం సంతోషంగా బతుకమ్మ జరుపుకోవాలి అధికారులు, సర్పంచ్‌లు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలి: మంత్రి సీతక్క తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా, ఆనందంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం, విద్యుత్, రహదారులు, తాగునీరు, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. దక్షిణాఫ్రికాలో సౌత్ ఆఫ్రికా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ...