మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

ముఖ్యమైన పాయింట్స్:ఆటపాటలతో సందడి చేసిన విద్యార్థినులు సూర్యాపేట జిల్లా కేంద్రం, విద్యానగర్:విద్యానగర్‌లోని మహాత్మ జ్యోతిబాపూలే మహిళా డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కళాశాల ప్రాంగణంలో విద్యార్థినులు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఆనందంగా గడిపారు. దీంతో కళాశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. విద్యార్థినుల ఉత్సాహం, ఆటపాటలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మానస...