ఇటుక బట్టీల మంటలు... ప్రకృతి కంట కన్నీటి దారలు..!

తిరుమలగిరి 09 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రం పలు గ్రామాలలో ఎలాంటి అనుమతులు లేకుండా దొడ్డిదారిన, దొంగ చాటుగా, యదేచ్చగా ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తుండడంతో పర్యావరణానికి ముప్పు సంభవిస్తుంది. ఇటుక బట్టీల మాఫియాతో పర్యావరణం, సారవంతమైన భూములు మాయమయ్యాయి. ఇటుక పట్టిలు పొలాలను తోడేస్తుండడంతో భూగర్భ జలాలకు ముప్పు వాటిల్లుతుంది. దీనివల్ల గాలి కాలుష్యంతో పంటలకు నష్టం కలుగుతుంది. పచ్చని పొలాల్లో నల్లని పొగ అలుముకుంటుంది. ఇటుక బట్టీల దందా కొనసాగుతున్నప్పటికీ అధికారులు చోద్యం చూస్తున్నారు. అధికారులు అండతోనే ఇటుక బట్టీల జోరు బాగుందని విమర్శలు వస్తున్నాయి. కళ్ళు ఉండి అధికారులు చూడకపోవడంతో బట్టీల దందా...