అసంపూర్తిగా నిలిచిపోయిన భవిత సెంటర్ భవనం

జోగులాంబ గద్వాల 8 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. ఇటిక్యాల . మండలం చాగాపురం గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల నందు చెవిటి మూగ మానసిక వికలాంగులకు విద్య బోధన నిమిత్తం గత సంవత్సరం భవిత సెంటర్ భవనం మంజూరు అయింది. ఈ భవనాన్ని కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టి బేస్ మెంట్ వరకు పిల్లర్లు వేసి అర్ధాంతరంగా నిర్మాణాన్ని ఆపివేయడం జరిగింది. దివ్యాంగుల విద్యార్థుల సౌకర్యార్థం బిల్డింగ్ పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.