అంగన్వాడి సెంటర్లో పోషణ మాసం
జోగులాంబ గద్వాల 8 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. ఇటిక్యాల . మండలంలో చాగాపురం గ్రామంలో అంగన్వాడి సెంటర్లో అంగన్వాడి టీచర్ల ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమానికి హాజరైన గ్రామ సర్పంచ్ సావిత్రమ్మ, శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ హేమలత, సూపర్వైజర్ బాలమ్మ, వారి ఆధ్వర్యంలో పోషణ మాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏడు నెలల చిన్నారులకుఅన్న ప్రాసన కార్యక్రమం సిడిపిఓ హేమలత చేతులమీదుగా నిర్వహించడం జరిగింది. చిన్నపిల్లలకు బరువులు తీయడం జరిగింది. సిడిపిఓ హేమలత మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు ప్రతినెల అంగన్వాడీ కేంద్రం ద్వారా అందించే పౌష్టిక ఆరాహాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని గర్భిణీ స్త్రీలకు బాలింతలకు సూచించారు. గర్భిణీలు ఆరోగ్యంగా ఉంటేనే...