దివ్య క్షేత్రం భద్రాద్రిలో మహాలయ పితృపక్షాల సందర్భంగా
పుణ్య గోదావరి నది వద్ద జరుగుతున్న పితృ కార్యాలు దాతల సహకారంతో అన్నదానాలు. తెలంగాణ వార్త అక్టోబర్ 8 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం. : భాద్రపద బహుళంలో పితృదేవతలకు ప్రీతికరమైన మహాలయ పక్షాలు (పితృపక్షాలు)సెప్టెంబర్ 27వతేదీ భాద్రపద బహుళ పాడ్యమి ఆదివారం నుండి భాద్రపద అమావాస్య (మహాలయ (పెద్దల) అమావాస్య అక్టోబర్ 10 శనివారం వరకు మహాలయ పితృపక్షాలు జరుగుతాయి. ఈ పితృపక్షాలలో స్వర్గస్తులైన మాతా పిత్రులకు, తమ వంశంలోని స్వర్గస్తులైన ఇతర పెద్దలకు తమ ఇండ్ల వద్ద, పవిత్ర నదీ తీరాల వద్ద పితృదేవతలను పూజించి వారికి పిండ ప్రధానాలు ఆచరించడం హైందవ సంస్కృతిలో కృతయుగం నుండి వస్తున్న మన సాంప్రదాయం....