రైతులకు కేంద్రం భారీ దసరా గిఫ్ట్.. ప్రతీఒక్కరి అకౌంట్లో రూ.2 వేలు..! జమ చేసేది అప్పుడే

రైతులకు కేంద్ర ప్రభుత్వం దసరా కానుక అందించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ నిధులను దసరా సందర్భంగా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దసరా పెద్ద పండుగ కావడంతో రైతుల ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు ముందుగానే రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అకౌంట్లో డబ్బులు జమ చేసేందుకు ప్రక్రియ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 20న దసరా పండగ రానుండగా.. నవంబర్‌లో దీపావళి రానుంది. దీంతో ఏ క్షణమైనా పీఎం కిసాన్ నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే అవకాశముందని చెబుతున్నారు. దీంతో దేశంలోని కోట్లామంది రైతులు ఈ నిధుల కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు అకౌంట్లోకి వస్తాయా అని ఆశగా...