వైద్య ఆరోగ్య శాఖలో 49 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో మొత్తం 49 పోస్టులను కాంట్రాక్ట్‌/అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ 49 పోస్టుల్లో జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింద 36,ఆయుష్‌ కింద 08,జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం (ఎన్‌టీఈపీ) కింద 05 పోస్టులు ఉన్నాయని తెలిపారు.అర్హత కలిగిన అభ్యర్థులు జిల్లా అధికారిక వెబ్‌సైట్ gadwal.telangana.gov.in నుండి దరఖాస్తు ఫారాలను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను 08-10-2026 నుండి 13-10-2026 సాయంత్రం 5:00 గంటల వరకు సమర్పించాలని సూచించారు. పోస్టుల వారీగా ఖాళీలు, విద్యార్హతలు,వయోపరిమితి, ఎంపిక విధానం,దరఖాస్తు విధానం తదితర...