ఆగండి.. ఆలోచించండి.. అడుగు వేయండి” పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Bhadradri Kothagudem:- భారత ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ (ఎంహెచ్ఏ) సూచనల మేరకు అక్టోబర్ 2026ను జాతీయ సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ మంత్‌గా నిర్వహిస్తున్న నేపథ్యంలో, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా “పాజ్ ఫర్ సేఫ్టీ – పాజ్. థింక్. వెరిఫై…” అనే నినాదంతో సైబర్ భద్రతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో “ఆగండి.. ఆలోచించండి.. అడుగు వేయండి” అనే సైబర్ భద్రతా అవగాహన పోస్టర్‌ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆవిష్కరించారు. సైబర్ జాగరూకత దివస్”*లో భాగంగా ప్రజలకు సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ప్రధానంగా పార్ట్‌టైమ్ జాబ్ ఫ్రాడ్‌లు, లోన్...