పట్టణ అభివృద్ధికే పెద్దపీట - మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది

సూర్యాపేట, అక్టోబర్ 07: పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను చేపడుతున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది తెలిపారు. బుధవారం పట్టణంలోని 18వ వార్డులో రూ. 5 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ, పట్టణంలోని ప్రతి వార్డులో అవసరమైన మౌలిక వసతులను గుర్తించి దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.సీసీ డ్రైన్ నిర్మాణంతో వర్షాకాలంలో మురుగునీరు నిలిచిపోకుండా ప్రజలకు ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధికి...