రాహుల్ గాంధీ అరెస్టు నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో టైర్లు దగ్ధం చేసి భారీ నిరసన
కేంద్ర ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్ కుమార్ ను అరెస్టు చేసి ఓటు చోరీ పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు మరికొందని అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఎసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్, డిసిసి అధ్యక్షులు గుడిపాటి నర్సయ్యలా సూచనలతో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు జావేద్ బేగ్ ఆధ్వర్యంలో టైర్లు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన...