పోషణతోనే ఆరోగ్యవంతమైన సమాజం

చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం సూర్యాపేట: పోషకాహారంతోనే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్ లాల్‌ పవార్‌ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్టార్‌ బ్లాంకెట్‌ హాల్‌లో తొమ్మిదో పోషణ మాసం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి కుటుంబంలో పోషకాహార ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని గుర్తించి సకాలంలో అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై...