గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడిచే అన్ని ఆర్టిసి బస్సుల్లో వికలాంగుల పాసులు అనుమతించలి
రావన్నపేట 7 అక్టోబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రామన్నపేట మండల పరిధిలోని ఇంద్రపాలనగరంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది.ఎన్.పి.ఆర్.డి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈ నెల అక్టోబర్ 8న ఆర్టిసి బస్సు భవన్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ హాజరై వారు ఆవిష్కరణ జరిగింది.ఈ సందర్బంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ..2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టిసి బస్సులలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి...