శ్రీ కుసుమ హరినాథ్ బాబా ఆస్తులు కాపాడండి
తెలంగాణ వార్త అక్టోబర్6 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం. సుమారు 100 సంవత్సరాలకు పూర్వం హరినాథ్ బాబా భక్తులు పోలిశెట్టి రామదాసు గారు భద్రాచలంలో అనేక వ్య యప్రయాసల కు ఓర్చి కుసుమహర్నాద్ బాబా దేవాలయం నిర్మించారు. ఆలయానికి ఉభయ తెలుగు రాష్ట్రాలలో సుమారు 300 ఎకరాలకు పైగా విలువైన భూములు ఉన్నాయి. భద్రాచలం పట్టణంలో ఐటీడీఏ ఆఫీస్ సమీపంలో సుమారు 10 కోట్ల రూపాయల విలువ చేసే ఇంటి స్థలాలు ఆక్రమణకు గురయినాయి. ఈ ఆక్రమణ విషయంలో జరిగిన వివాదాలు ఉన్నత న్యాయస్థానాల దృష్టికి వెళ్లడం జరిగింది. న్యాయస్థానా ల లోకుసుమ హరినాథ్ బాబా దేవాలయానికి అనుకూలంగా తీర్పులు రావడం కూడా జరిగింది....