ప్రజలు మా ప్రభుత్వానికి అండగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నారు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న తమ ప్రభుత్వానికి అండగా ఉండేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళ వారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి లో నిర్మిస్తున్న సమీకృత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను రాష్ట్ర పౌరసరఫరాలు మరియు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి అయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అధిక నిధులు, వనరులతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశించామని అయితే గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు...