ఆర్డీఎస్ సమస్యల పరిష్కారానికి చర్చావేదిక

అలంపూర్‌ చౌరస్తాలో సన్నాహక సమావేశం.. కీలక తీర్మానాలపై చర్చ అలంపూర్‌, అక్టోబర్‌ 5: ఆర్డీఎస్‌ ఆయకట్టు రైతుల సాగునీటి సమస్యల పరిష్కారం, పెండింగ్‌ ప్రాజెక్టుల పనుల పూర్తిపై త్వరలో అలంపూర్‌ చౌరస్తాలో విస్తృత స్థాయి రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు ఉమ్మడి పాలమూరు పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన సమితి అలంపూర్‌ తాలూకా జేఏసీ కన్వీనర్‌ రామ్మోహన్‌ తెలిపారు. సోమవారం అలంపూర్‌ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. ఆర్డీఎస్‌ను బ్యారేజీగా మార్చి ఆయకట్టుకు రావాల్సిన నీటిని సాధించాలని, కాలువను ఆధునీకరించాలని నిర్ణయించారు. నెట్టెంపాడు లింక్‌ రిజర్వాయర్ల 99, 100 ప్యాకేజీల పెండింగ్‌ పనులు పూర్తి చేయడంతోపాటు చిన్నోనిపల్లి...