సోషల్ మీడియా కోసం సాహసం.. ప్రాణాలతో చెలగాటం

ఆకతాయి బాలురను గుర్తించిన సూర్యాపేట ట్రాఫిక్ పోలీసులు శిక్ష కాదు.. సరిదిద్దే ప్రయత్నం! మానవతా దృక్పథంతో కౌన్సెలింగ్ మొదటి తప్పిదంగా భావించి హెచ్చరించిన పోలీసులు.. మరోసారి చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ సూర్యాపేట: బైక్‌పై ప్రమాదకరంగా, అసభ్యకరంగా కూర్చొని డ్రైవింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేసిన బాలురను సూర్యాపేట ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. యువతలో కొందరు చేస్తున్న ఇలాంటి ఆకతాయి చేష్టలు తమకే కాకుండా రహదారిపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు, టౌన్ సీఐ వెంకటయ్య ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్‌ఐ యాదవేందర్ రెడ్డి,...