పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల సందర్భంగా లఘుచిత్రం, ఫోటోగ్రఫీ పోటీలు

జోగులాంబ గద్వాల 6అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల్. జిల్లాలో పోలీస్ ఫ్లాగ్ డే (అమరవీరుల స్మారక వారోత్సవాలు) 21st అక్టోబర్ సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 3 నిమిషాల లఘుచిత్రం (షార్ట్ ఫిల్మ్) మరియు ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనే ఆసక్తి ఉన్న ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు మరియు సృజనాత్మక ప్రతిభ కలిగిన వారు పోలీస్ శాఖ విధులు, ప్రజలకు అందిస్తున్న సేవలు, పోలీస్–ప్రజల స్నేహపూర్వక సంబంధాలు, అమరవీరుల త్యాగాలు, మహిళలు మరియు పిల్లల భద్రత, ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రత, నేర నియంత్రణ, సామాజిక అవగాహన కార్యక్రమాలు తదితర...