కొన్ని పాఠశాలలకు యూనిఫామ్లు
మరికొన్నింటికి మొండిచేయి. జోగులాంబ గద్వాల 6 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. ఇటిక్యాల . జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలంలోని యూనిఫామ్ల పంపిణీలో అవకతవక లు అసమానతపై విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన.. సెర్ప్ ఏపిడీ, సంబంధిత అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేదు అని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్ని పాఠశాలలకు యూనిఫామ్లు పంపిణీ చేసినప్పటికీ, మరికొన్ని పాఠశాలలకు ఇప్పటివరకు యూనిఫామ్లు అందకపోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. యూనిఫామ్ల పంపిణీ ప్రక్రియలో సమన్వయం, పర్యవేక్షణ లోపించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అర్హులైన విద్యార్థులందరికీ సమానంగా యూనిఫామ్లు అందేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. అయితే కొన్ని పాఠశాలలకు మాత్రమే...