జర్నలిస్టుల ఆరోగ్య రక్షణకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులు ఇవ్వాలి

- సీఎం రేవంత్ రెడ్డికి పోస్టుకార్డులు రాసిన జర్నలిస్టులు - టీయుడబ్ల్యుజె హెచ్ 143 ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం. సూర్యాపేట, 5 అక్టోబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలను ప్రబుత్వం దృష్టికి తీసుకుపోవడంలో ప్రధాన భూమిక పోషిస్తున్న జర్నలిస్టులు నేడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని టీయుడబ్ల్యుజె హెచ్- 143 జిల్లా అధ్యక్షులు వజ్జె వీరయ్యయాదవ్ అన్నారు. గత ప్రభుత్వం జారీ చేసిన జర్నలిస్టుల హెల్త్ కార్డులను ప్రస్తుత ప్రభుత్వం వచ్చి మూడేళ్ళు గడుస్తున్నా హెల్త్ కార్డులను కొనసాగించే పరిస్థితి లేక పోవడంతో అనారోగ్యానికి గురైన జర్నలిస్టులు ఆర్ధికంగా దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హెల్త్ కార్డులను...